- Advertisement -
సంగారెడ్డి టౌన్ : అమెజాన్, సాలివీక్ స్కిల్ డెవలప్‌మెంట్ కంపెనీలలో ఉద్యోగాలకు ఈ నెల16వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం డిఆర్‌డిఎ పాత కార్యాలయం బైపాస్‌రోడ్డు సంగారెడ్డిలో శనివారం ఉదయం 10గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు, అనుభవ ధ్రువీకరణ పత్రం ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ పాస్ ఫోటోజైస్ ఫోటోలతో రావాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.
- Advertisement -