Friday, December 20, 2024

ఈ నెల 12న జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఈ నెల 12న ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు తెలపారు. హైదరాబాద్‌లోని సుస్థిరా ఇన్ఫా ప్రాజెక్టు ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ మేనేజరు పోస్టులకు డిగ్రీ అర్హతతో పాటు సంవత్సరం అనుభవం ఉన్న పురుష అభ్యర్థులు, అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 20 పోస్టులకు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎంపికైన వారు హైదరాబాద్‌లో పని చేయాలని , ఉద్యోగ స్థాయిని బట్టి రూ.15 నుంచి 18 వేల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు తమ సర్టిపికెట్లతో జాబ్ మేళాకు రావాలని అన్నారు. మరిన్ని వివరాలకు 89853 36947, 95026 42441 నెంబర్‌లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News