Sunday, February 2, 2025

ఈ నెల 28న సంగారెడ్డిలో జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సుస్థిర ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. సుస్థిర ఇన్‌ఫ్రా ప్రాజెక్టు కంపెనీలో 50 ఉద్యోగాల భర్తీకి 28వ తేదీ నాడు ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని వెలుగు ఆఫీస్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్ మేళా ఉంటుందన్నారు.

అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాలలోపు ఉండాలని పదవ తరగతి, డిగ్రీ విద్యార్హతలు గల అభ్యర్థులు అర్హులన్నారు. జీతం 15వేల నుండి 18వేల రుపాయల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల28న నిర్ణీత సమయంలోగా విద్యార్హత సర్టిఫికెట్‌లు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ సర్టిఫికెట్‌ల జిరాక్స్‌లతో హాజరు కావాలని ఆమె బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News