Wednesday, January 22, 2025

రేపు ఉద్యోగ మేళా

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని డిఆర్‌డిఓ శ్రీనివాసరావు తెలిపారు. రెండు ప్రైవేట్ కంపెనీలు ఈమేళాలో పాల్గొంటున్నాయని చెప్పారు.జెకె ఫెన్నార్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ప్రొడక్షన్ అసోసియేట్ పోస్టులు 65 ఖాళీలున్నాయన్నారు. వరుణ్ మోటార్‌సలో 200 ట్రైనీ సర్వీస్ అడ్బయిజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రొడక్షన్ అసోసియేట్ పోస్టునకు 19 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని, పదో తరగతి పాస్, ఐటిఐ,ఇంటర్ డిగ్రీ విద్యార్హతలు కలిగి ఉండాని పేర్కొన్నారు.కనీస వేతనం 8500 నుంచి 10,150 వరకు లభిస్తుందన్నారు.ఎంపికయిన అభ్యర్థులు పటాన్‌చెరులో పని చేయాల్సి ఉంటుందన్నారు.

ట్రైనీ సర్వీస్ అడ్బయిజరు పోస్టుకు పదవ తరగతి పాస్ , ఇంటర్, ఐటిఐ,బిటెక్, డిప్లమో విద్యార్హతలు అర్హులని అన్నారు. అభ్యర్థుల వయస్సు19 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. కనీస వేతనం 9000 నుంచి 12000 వరకు లభిస్తుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 20ప ఉదయం 10 గంటలకు బైపాస్ రోడ్డులో ఉన్న పాత డిఆర్‌డిఎ కార్యాలయానికి రావాలన్నారు. విద్యార్హతల జిరాక్సు కాపీలతో పాటు, పాస్‌పోర్టు సైజ్ ఫోటోలతోనేరుగా ఇంటర్వూకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News