Wednesday, January 22, 2025

19న సంగారెడ్డిలో ఉద్యోగ మేళా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డిః వరుణ్ మోటార్స్ కంపెనీలో 360ఖాలీలున్నాయని, అసోసియేట్ ఎలక్ట్రిషన్, క్వాలీటీ అసోసియేట్, ల్యాబ్ అసోసియేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు 19వ తేదీన ఇంటర్వూలు ఉంటాయని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు.  పదవ తరగతి పాస్, ఇంటర్, ఐటిఐ, బిటెక్, డిప్లామా విద్యార్హతలు కలిగి ఉండాలన్నారు. వేతనం 10వేల నుండి 12వేలు ఉంటుందన్నారు.ఎంపికైన అభ్యర్థులు గగ్గిలాపూర్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. మెడ్‌ప్లస్ కంపెనీలో 150ఫార్మాసిస్ట్ సిఎస్‌ఎ, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. వీటికి పదవతరగతి పాస్, ఇంటర్ డిగ్రీ డిఫార్మాసీ, బిఫార్మసీ, ఎంఫార్మసీ విద్యార్హతలు ఉండాలని చెప్పారు.

రూ.10వేల నుండి రూ.12వేల వేతనంతోపాటు ఇన్సెంటివ్స్ ఉచిత వసతి ఉంటుందని పేర్కోన్నారు. ఎంపికైన అభ్యర్థులు హైద్రాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఉద్యోగాలన్నింటికి వయో పరిమితి 18నుండి 24సంవత్సరాలని పేర్కోన్నారు. ఈ నెల19న సంగారెడ్డి బైపాస్‌ రోడ్డులోని డిఆర్‌డిఎ కార్యాలయంలో ఉదయం 10గంటలకు ఇంటర్వూలు నిర్వహిస్తారన్నారు. ఆసక్తి గల అభ్యరుథలు తమ విద్యార్హతల ధృవ పత్రాలు, అనుభవ ధ్రువీకరణ, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు జిరాక్స్‌ప్రతులతో పాస్‌పోర్టు సైజ్ ఫోటోలతో నేరుగా హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్నీ జిల్లాలోని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కలెక్టర్ గురువారం ఒక ప్రకటనలో కోరారు.

Job Mela at Sangareddy DRDA Office on Nov 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News