Monday, December 23, 2024

1న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు జాబ్‌మేళా

- Advertisement -
- Advertisement -

 

సంగారెడ్డిః ఎస్‌ఐఎస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల కొరకు డిసెంబర్1న ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో 1వ తేదీన సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల కొరకు బైపాస్ రోడ్డులోని పాత వెలుగు ఆఫీస్‌లో జాబ్‌మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు వయస్సు 21నుండి 35సంవత్సరాలలోపు ఎత్తు 167.5సెంమీటర్లు ఉండాలని, విద్యార్హతలు పదవతరగతి పాస్, ఫెయిల్ అయిన వారు అర్హలన్నారు.

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఒక నెల పాటు ఆన్‌లైన్ ద్వారా శిక్షణను ఇచ్చి అన్ని వసతులతో కూడిన సౌకర్యాలతో ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. జీతం 12వేల నుండి 16వేల వరకు ఉంటుందని, ఈపిఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, బోనస్ తదితరాలు ఉంటాయన్నారు. ఎంపికైన అభ్యర్థులు ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్ ఫారంకు 350 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు డిసెంబర్1న నిర్ణీత సమయంలోగా నేరుగా జాబ్‌మేళాకు హాజరు కావాలని ఆమె మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News