Wednesday, December 25, 2024

నిరుద్యోగుల మోముల్లో చిరునవ్వే నా లక్ష్యం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : నిరుద్యోగ యువతీ, యువకుల మోముల్లో చిరునవ్వు చూడలనేదే నా ప్రధాన లక్ష్యం అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది… ఇందు కోసం ప్రతి ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాకు పదవి ఉన్న లేకున్నా జాబ్ మేళాలను నిర్వహిస్తా… ఇది నా హామీ అని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఖమ్మం నగర శివారులోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం పొంగులేటి ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది.

మొత్తం 21వేల మందికి పైగా అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు చేసుకోగాదాదాపు 1500ల మందికి పైగా అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తానని మోసం చేశారని, ఎన్నికల ముందు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం…? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఉంటే నామ మాత్రపు ఖాళీలను భర్తీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి ఉద్యోగాల నోటిఫికేషన్ వేశారని, మళ్లీ అందులోనూ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న తరుపు వారికి ఉద్యోగాలను ఇప్పించేందుకు పేపరును లీకేజీని చేయించారని, మూడు నెలలు గడుస్తున్నా పేపర్ లీకేజి నిందితులపై ఇంతవరకు చర్యలు లేవని ఈ లీకేజి కేసును సిట్టింగ్ జడ్జి చే లేదా సీబీఐ చే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

తినితినక కష్టాలు పడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను చదివిస్తే వారి ప్రతిభకనుగుణంగా ఉద్యోగాలను కేటాయించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి పేపర్ లీకేజీ చేయించడం దురదృష్టకరమని, టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఖాతాలో లక్ష రూపాయాలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇవ్వాలని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాకుండా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటిని భర్తీ చేసేందుకు కావాల్సిన నోటిఫికేషన్లు జారీ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన సూచించారు.

ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని నిరుద్యోగుల ఆశలను, ఆశయాలను నెరవేర్చేందుకు తాను పూనుకున్నాను. వీలైనంత త్వరలో ప్రతి ఒక్కరి ఆశయాలను నెరువేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మెగా జాబ్ రూ.15వేలు మొదలుకొని రూ.65 వేల వరకు నెలసరి వేతనాలు చెల్లించే కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని. చెవిటి, మూగ, వికలాంగులు, ట్రాన్స్ జెండర్లు మొదలగు వారికి ప్రత్యేక ప్యాకేజీలతో జాబ్ లు ఇప్పించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశామన్నారు. అనంతరం ఇంటర్వ్యూలో ప్రతిభ కనబర్చి ఉద్యోగం సాధించిన వారికి పొంగులేటి అపాయింట్ మెంట్ ఆర్డర్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, వూకంటి గోపాలరావు, జారె ఆదినారాయణ, డాక్టర్ కోటా రాంబాబు, విజయబాయి, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, మియాభాయ్, నారపోగు వెంకట్, రైట్ ఛాయిస్ డైరెక్టర్మెండెం కిరణ్ కుమార్, కొత్త కోటేశ్వరరావు, జాబ్ మేళా కన్సల్టెన్సీల నిర్వాహకుడు మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. 120కి పైగా కంపెనీల ద్వారా దాదాపు 10 వేలకు పైగా ఉద్యోగాలను ఇప్పించేందుకు ఈమేళాను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News