Monday, December 23, 2024

తెలంగాణాలో జాబ్ మేళా, 2000 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణాలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఏ) సన్నాహాలు చేస్తోంది. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న 35 కంపెనీలు సుమారు 1500నుంచి 2000 వరకూ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. వరంగల్ లో ఉన్న క్వాడ్రంట్ టెక్నాలజీస్ సంస్థలో డిసెంబర్ 18వ తేదీన ఉదయం 9నుంచి ఐదుగంటల వరకు  ఇంటర్వ్యూలు జరుగుతాయి.

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు బి.టెక్, ఎం.టెక్, ఎంబిఏ, ఎంసిఏ, ఫార్మసీలలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏదేని డిగ్రీ పట్టా కలిగి ఉండాలి. 2021, 2024 మధ్య ఉత్తీర్ణులై ఉండాలి. జాబ్ మేళాలో టెక్ మహీంద్రా, జెన్ పాక్ట్, క్వాడ్రంట్ టెక్నాలజీస్, థ్రిమిర్ సాఫ్ట్ వేర్, కారా, వన్ స్టాప్, టాటా స్ట్రైవ్, అపోలో మెడ్ స్కిల్స్, వరుణ్ మోటార్స్, వి3 టెక్ సొల్యూషన్స్ వంటి కంపెనీలు పాల్గొంటున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News