Saturday, March 29, 2025

అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 కొలువులు

- Advertisement -
- Advertisement -

భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన
మంత్రి సీతక్క 6వేలు
అంగన్వాడీ టీచర్లు, 7వేల
హెల్పర్ పోస్టుల భర్తీకి
గ్రీన్‌సిగ్నల్ కోడ్ ముగియగానే
జిల్లాల వారీగా నోటిఫికేషన్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మ హిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జా తరకు ముహుర్తం ఖరారైంది. అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 14,236 పోస్టులను భ ర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పచ్చ జెండా ఊపారు. మం త్రి సీతక్క శనివారం నాడు ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున, కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి వివరించారు. ఖాళీల వివరాలతో కూడిన నోటిఫికేషన్లను ఆయా జిలాల్ల కలెక్టర్లు జారీ చేస్తారని తెలిపారు. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం తొలిసారి అని పేర్కొన్నారు. ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా పనిచేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News