Wednesday, January 22, 2025

త్వరలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

- Advertisement -
- Advertisement -

Job notifications coming soon:Minister Vemula

ఆ విషయం తెలిసే బిజెపి నేతల దొంగదీక్షలు
స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచన : మంత్రి వేముల

మనతెలంగాణ/హైదరాబాద్ : యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ విషయం తెలిసే బిజెపి నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని, విభజన చట్టం హామీలు సహా ఏమీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. నూతన సంవత్సరం సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆర్‌అండ్‌బి డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు, సిబ్బంది, న్యాక్ డైరెక్టర్, సిబ్బంది కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బి శాఖ నూతన సంవత్సర డైరీ, క్యాలండర్, హ్యాండ్ బుక్ , న్యాక్ డైరీని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే కలిసి వచ్చే వారితో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో పోరాడతామని ఆయన హెచ్చరించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహారిస్తోందని ఆయన ఆక్షేపించారు.

ప్రభుత్వానికి రైతులు, పేదలు రెండు కళ్లు

కొత్త సచివాలయం, అమరవీరుల స్మారకం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ ఏడాది అందుబాటులోకి వస్తాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి రైతులు, పేదలు రెండు కళ్లన్నారు. గత హామీలతో పాటు కొత్తవి నేరవేర్చుతున్నామన్నారు. లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని పెద్ద రాష్ట్రాల్లో సైతం అన్ని కొలువులివ్వలేదన్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలన్నది సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. 65 వేల పోస్టులు ఖాళీలకు సంబంధించి జాబితా సిద్ధం చేశామన్నారు. త్వరలో మరో 30 వేల ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. బండి సంజయ్‌ది దొంగ దీక్ష అని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని, దానిపై సమాధానం చెప్పరా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి తరలివచ్చిన 17 వేల కొత్త పరిశ్రమలతో యువతకు ప్రత్యక్షంగా పది లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ టిఆర్ అండ్ బి శ్రీనివాస్ రాజు, స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఆర్‌అండ్‌బి యూనియన్, సిబ్బంది న్యాక్ డైరెక్టర్ బిక్షపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంవత్సరం సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆర్‌అండ్‌బి డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు, సిబ్బంది, న్యాక్ డైరెక్టర్, సిబ్బంది కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బి శాఖ నూతన సంవత్సర డైరీ, క్యాలండర్, హ్యాండ్ బుక్, న్యాక్ డైరీ ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే కలిసి వచ్చే వారితో కలిసి సిఎం కెసిఆర్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో పోరాడతామని ఆయన హెచ్చరించారు. రైతులకు ప్రభుత్వం అన్నీ చేస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహారిస్తోందని ఆయన ఆక్షేపించారు.

ప్రభుత్వానికి రైతులు, పేదలు రెండు కళ్లు

కొత్త సచివాలయం, అమరవీరుల స్మారకం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ ఏడాది అందుబాటులోకి వస్తాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి రైతులు, పేదలు రెండు కళ్లన్నారు. గత హామీలతో పాటు కొత్తవి నేరవేర్చుతున్నామన్నారు. లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని పెద్ద రాష్ట్రాల్లో సైతం అన్ని కొలువులివ్వలేదన్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలన్నది సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. 65 వేల పోస్టులు ఖాళీలకు సంబంధించి జాబితా సిద్ధం చేశామన్నారు. త్వరలో మరో 30 వేల ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. బండి సంజయ్‌ది దొంగ దీక్ష అని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని, దానిపై సమాధానం చెప్పరా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి తరలివచ్చిన 17 వేల కొత్త పరిశ్రమలతో యువతకు ప్రత్యక్షంగా పది లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ టిఆర్ అండ్ బి శ్రీనివాస్ రాజు, స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఆర్‌అండ్‌బి యూనియన్, సిబ్బంది న్యాక్ డైరెక్టర్ బిక్షపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News