Tuesday, January 21, 2025

పరిశ్రమలు నెలకొల్పితే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు

- Advertisement -
- Advertisement -

మనోహరాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతవరణం కల్పించడం, టిఎస్ ఐపాస్ ద్వారా సులభతరంగాఅన్ని రకాల అనుమతిలివ్వడంతో పాటు24 గంటల విద్యుత్, నీళ్లు, రాయితీలు అందిస్తుండటం ద్వారా నేడు విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని స్పోఫి హెల్త్‌కేర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టర ముఖ్యమంత్రి మెదడు కంప్యూటర్ లాంటిదని, ఎప్పుడు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాడని, వారిపై ఉన్న నమ్మకంతోనే పరిశ్రమలస్థాపనకు వేగవంతంగా ఇస్తున్న అనుమతులు, టిఎస్‌ఐఐసి ద్వారా ఇస్తున్న భూములు, మౌలిక వసతులు, రాయితీ ప్రయోజనాల దృష్టా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టుటకు ముందుకువస్తున్నాయన్నారు.

నలుములల అభివృద్ధి చెందితేనే ప్రగతిసాద్యమని, నర్సాపూర్ నియోజకవర్గంలో హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున ఈ నియోజకవర్గంలోని మాసాయిపేట, పోతారం గ్రామాలలో పరిశ్రమల ఏర్పాటుకుచొరవ చూపాలని, అందుకు అవసరమైన భూమిని లభ్యంగా ఉందని అన్నారు. ఎస్సీ,ఎస్టీలతోపాటు బిసి వర్గాలు కూడా పరిశ్రమల ఏర్పాటు ముందుకు వచ్చి పరిశ్రమలు నెలకొల్పితే ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులు ఉపాధి అవకాశాలు లబిస్తాయని అన్నారు. అదేవిధంగాసేవా దృక్పథంతో సిఎస్‌ఆర్‌నిధులు అందజేయాలన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధ్ది చేయాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలు అదుపులో ఉండటం, 24 గంటల విద్యుత్, పరిశ్రమలకు 10 శాతం నీళ్లు, మౌలిక వసతులు కల్పించడం ద్వారా నేడు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, ఉపాధి కల్పనలో ఐటిరంగంలో అగ్రగామిగా ఉన్నామన్నారు.

పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలుకల్పించిందన్నారు. యువత సద్వినియోగం చేసుకుని మరో పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలు నెలకొల్పుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎఫ్‌డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో రంగానికి ఒక్సో సెజ్‌ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమలు విస్తరిస్తున్నాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు చక్కటి అవకాశాలున్నాయని ఆ దిశగా పారిశ్రామిక వేత్తలుముందుకు రావాలన్నారు. అసంఘటిత కార్మిక సంక్షేమబోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 21 రోజులపాటు నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో అందరిని సంఘటిత పరచి ప్రగతిని మననంచేసుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ దేశ ఆర్థిక ప్రగతికి పునాది వ్యవసాయం,పరిశ్రమలు, సేవారంగాలని, ఒక చక్కటివిజన్‌తో పరిశ్రమలు నెలకొల్పుతున్న పారిశ్రామిక వేత్తలు సెల్యూట్ చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పాలంటే భూమి, రోడ్డు, విద్యుత్, నీళ్లు, పెట్టుబడి, వృత్తి నైపుణ్యత గల కార్మికులతో పాటు నేను నిరంతరాయంగాపరిశ్రమను నడుపుతాననే దృఢ సంకల్పం ఉండాలని, అప్పుడే పరిశ్రమ నిలదొక్కుకుని ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించగలుగుతారని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుహృద్బాత వాతవరణం కల్పిస్తూ ఎన్నో రాయితీలు ఇస్తున్నదని, పారిశ్రామిక వేత్తలు ముందుకువచ్చి పరిశ్రమలు నెలకొల్పాలని కోరారు. జిల్లాలో టిఎస్ ఐపాస్ విధానం ద్వారా 8421 కోట్ల పెట్టుబడితో 790 యూనిట్లు నెలకొల్పి 26,354 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.

అదేవిదంగా ట్ ప్రైడ్ క్రింద 1632 మంది ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులకు69 కోట్ల 29 లక్షల ఆర్థిక సాయం అందించామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ పారిశ్రామిక వేత్తలకు మెమోంటో, శాలువతో సన్మానించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రాగౌడ్, ఆర్డీఓ శ్యామ్‌ప్రకాశ్, ఎడి మైన్స్ జయరాజ్, డిఆర్‌డిఓ శ్రీనివాస్, మనోహరాబాద్ సర్పంచ్ మహిపాల్‌రెడ్డి, ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్ ప్రభావతి పెంటయ్య, ఉమ్మడి మండల పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్, ఎంపిపి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News