Saturday, December 21, 2024

ఓరియంట్‌లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలి:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కాసిపేట: ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీలో 2 వేల కోట్ల రూపాయలతో 3 మిలియన్ టన్నుల కెపాసిటీ గల నాలుగవ ప్లాంట్ నిర్మాణం చేపట్టగా, సోమవారం ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో చేపడుతున్న నాలుగవ ఎక్స్‌టెన్షన్ ప్లాంట్ వల్ల పర్యావరణం కాలుష్యం లేకుండా ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆయన సూచించారు.

నూతనంగా చేపట్టనున్న ప్లాంట్‌లో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. ఇక్కడి ప్రాంత నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కంపెనీలో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. దేవాపూర్ అటవీ ప్రాంత పరిధిలో ఉన్న కారణంగా వనరక్షణకు ఓరియంట్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం కృషి చేయాలన్నారు. ఇదిలా ఉండగా ఓరియంట్ సిమెంట్ కంపెనీలో రూ. 2వేల కోట్లతో 3 మిలియన్ టన్నుల సామర్థం గల నిర్మించనున్న నాలుగవ ప్లాంట్‌లో 10 శాతం వరకు స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని యాజమాన్యం తెలిపింది. ప్లాంట్ అన్ని అనుమతులు పొందిన తరువాత ప్రారంభించి 18 నెలల్లో ప్లాంట్‌ను పూర్తి చేయడం జరుగుతుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహామూద్‌ఆలీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, దేవాపూర్ సర్పంచి మడావి తిరుమల అనంతరావ్, ఎంపిపి రొడ్డ లక్ష్మీ రమేష్, ఓరియంట్ గుర్తింపు సంఘం అధ్యక్షులు పుస్కూరి రాంమోహన్‌రావు, ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధ్యక్షులు ఎస్.హెచ్. సత్యబ్రతధర్మ, జోషి రామగుండం పోలీస్ కమిషనర్ రెమో రాజేశ్వరీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News