Monday, December 23, 2024

25000 ఉద్యోగాల రద్దు ఘోర అన్యాయం : మమత

- Advertisement -
- Advertisement -

25000 స్కూల్ ఉద్యోగాలు రద్దు చేయడం ఘెర అన్యాయం. ఎవరో ఒకరు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి తప్ప మొత్తం 25,000 ఉద్యోగాలను రద్దు చేస్తే స్కూళ్లు ఎలా నడుస్తాయి.? ఇదంతా బీజేపీ కుట్ర. న్యాయవ్యవస్థపై నాకు గౌరవం ఉంది. కానీ ఏం జరిగిందంటే ఘోర అన్యాయం జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిరుద్యోగం అత్యధిక స్థాయిలో పెరిగిపోతుంటే బీజేపీ నేతలు ఉద్యోగాలను ఊడగొట్టారు.

దీంతో ఉద్యోగాలు కోల్పోయినవారు ఎన్నికల విధుల్లో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. కాషాయ శిబిరంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల డ్యూటీ చేస్తారు. మేం ఉద్యోగాలు ఇస్తున్నాం. పదిలక్షలకు మించి ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయనీయకుండా బీజేపీ రాజకీయ ఎజెండా ఉపయోగిస్తోంది. అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మేం వారికి మద్దతు ఇస్తాం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News