Sunday, January 19, 2025

చదువు పేరుతో ఉద్యోగాల వేట: భారతీయ విద్యార్థులపై ఆస్ట్రేలియన్ వర్సిటీల ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: చదువుకునే నెపంతో ఉద్యోగాల కోసం వస్తున్న భారతీయ విద్యార్థులపై ఆస్ట్రేయన్ యూనివర్సిటీలు దృష్టి సారించాయి. ఉన్నత విద్యాభ్యాసం కోసం లక్షల్లో వస్తున్న దరఖాస్తులను చూసి కెనడా ఆశ్చర్యపోగా ఇప్పుడు ఆస్ట్రేయా వంతైంది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల ప్రవేశంపై ఆస్ట్రేలియా ఆంక్షలు కూడా విధిస్తోంది.
2019లో 75,000 మంది విద్యార్థులకు కెనడా ప్రవేశం కల్పించగా అంతకుమించిన సంఖ్యలో ఈ ఏడాది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా యూనివర్సిటీ, ఆడిత్ కోవన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వొల్లాంగాంగ్, టోరెన్స్ యూనివర్సిటీ, సదరన్ క్రాస్ యూనివర్సిటీకి చెందిన ఏజెంట్ల నుంచి వస్తున్న ఈమెయిల్స్‌ను బట్టి భారతీయ విద్యార్థుల దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోందని ఆస్ట్రేలియా నుంచి వెలువడే ది ఏజ్, ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

Also Read: కట్నం కోసం బ్లాక్‌మెయిల్: భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి…

విద్యాభ్యాసం కోసం కాకుండా ఉద్యోగాలు సంపాదించి స్థిరపడిపోవడమే లక్ష్యంగా కొన్ని భారతీయ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇటువంటి విద్యార్థుల ప్రవేశాన్ని అడ్డుకోవాలని ఈ యూనివర్సిటీలు నిర్ణయించుకున్నాయి. పంజాబ్, హర్యానాకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను ఎడిత్ కోవన్ యూనివర్సిటీ ఆమోదించడం లేదు. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన దరఖాస్తులపై విక్టోరియా యూనివర్సిటీ ఆంక్షలు విధించింది.
భారత ఉపఖండంతోపాటు మరి కొన్ని దేశాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు పెట్టి అసలైన విద్యార్థులకు అవకాశం కల్పించడానికి యూనివర్సిటీ ఆఫ్ వొల్లాంగాంగ్ చర్యలు తీసుకుంటోంది. ఇక గుజరాత్, హర్యానా, పంజాబ్ నుంచి వచ్చే దరఖాస్తులపై గట్టి నజర్ వేయాలని లోరెన్స్ యూనివర్సిటీ నిర్ణయించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News