Wednesday, January 22, 2025

కెనడా పిలుస్తోంది… 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ !

- Advertisement -
- Advertisement -

 

Abandon vaccancies in Canada

ఒట్టవా: కెనడాలో ప్రస్తుతం 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కెనడాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి, మంచి ఉద్యోగం కావాలనుకున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అక్కడ 2021 మే నుంచి 3లక్షలకు పైగా ఉద్యోగాల ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడైతే 10 లక్షలకు పైగానే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అక్కడి లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 2022 మే నుంచి అక్కడ ఉద్యోగుల కొరత పెరుగుతూ వస్తోంది. అక్కడ చాలా వరకు వయస్సు మీద పడినవారు పెరిగిపోవడం లేక రిటైరయిపోవడం వల్ల ఈ కొరత కానవస్తోంది. ఇప్పుడు కెనడా 2024 వరకు 4.3 లక్షల మంది విదేశీ ఉద్యోగులను రప్పించాలని లక్షంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని సిఐసి న్యూస్ రిపోర్టు పేర్కొంది. ఒకవేళ ఎవరైనా కెనడాలో శాశ్వత నివాసం కోసం ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ద్వారా అప్లయ్ చేయాలనుకుంటే మాత్రం ఇది చక్కని తరుణం. మరో సర్వే ప్రకారం ఇదివరకటి కన్నా ఇప్పుడు కెనడాలో చాలా ఉద్యోగాలు లభించగలవు. వృత్తి, విజ్ఞానం, సాంకేతిక సేవా రంగాలలో, గిడ్డంగి,ఫైనాన్స్, భీమా, రిక్రియేషన్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. కెనడాలో ఈ ఏడాది లేబర్ మార్కెట్ చాలా వరకు పడిపోయింది. కెనడాలో ఈ ఏడాది ప్రతి 10 మందికి ముగ్గురు రిటైర్ కాబోతున్నారు. దీనికి తోడు కెనడాలో 2020 నాటికి సంతానోత్పత్తి(ఫెర్టిలిటీ రేటు) ఒక్కో మహిళకు 1.4 పిల్లల స్థాయికి కుదించుకుపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News