Saturday, December 21, 2024

108లో ఉద్యోగ నియామకాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఇల్లందు టౌన్‌: ఆసక్తి గల అభ్యర్ధులకు 108లో ఉద్యోగ నియామకాలకు అవకాశం కల్పించడం జరుగుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రోగాం అధికారి భూమా నాగేందర్ తెలిపారు. ఇఎమ్‌ఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ సంస్ధ నందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నడుస్తున్న 108 వాహనాలలో పనిచేయుటకు ఇఎమ్‌టి, పైలట్ నియామకాలకు ఈనెల 09వ తేదిన భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో ఉదయం 10గంటలనుండి మధ్యాహ్నం 02గంటలవరకు ఇంటర్వ్యూ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఇఎమ్‌టి అభ్యర్ధులు అర్హత వయస్సు 30, డిప్లోమా, బిఎస్‌సి లైఫ్ సైన్స్, బిఎస్‌సి నర్సింగ్, జిఎన్‌ఎమ్, బిఫార్మసీ, డిఫార్మసీ కల్గివుండాలన్నారు. పైలట్ అభ్యర్ధులు వయస్సు 35, పదిపాస్, ఎత్తు 5.4, డ్రైవింగ్ లైసెన్స్, హెచ్‌ఎమ్‌వి ఎల్‌ఎమ్‌వి బ్యాడ్జ్ తప్పకుండా కల్గివుండాలన్నారు. మరింత సమాచారం కొరకు 9121003246, 7330922279 ఫోన్ నెంబర్‌లను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News