Monday, December 23, 2024

రోజ్‌గార్ మేలాలో 71వేలమందికి ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆధర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేలాలో 71వేల మందికి ఉద్యోగాలు లభించాయి. వీరికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు.దేశవ్యాప్తంగా 45ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అభ్యర్థులకు నియామక పత్రాల కాపీలను అధికారులు అందజేశారు.

గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. దేశాభివృద్ధిలో యువత నేరుగా పాలుపంచుకునేందుకు వారికి సాధికారత, ఉద్యోగాలను కల్పించానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌లో 75వేల మందికి లెటర్లును అందించినట్లు పిఎంఒ పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News