Friday, December 20, 2024

Kejriwal: అస్సాంలో ఆప్ గెలిస్తే యువతకు ఉద్యోగాలు, ఉచిత విద్యుత్: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

గువాహటి : అస్సాంలో ఆప్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు విద్యుత్‌ను ఉచితంగా అందించడమౌతుందని ఆప్ అధినేత , ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీలు గుప్పించారు. ఆప్ ప్రభుత్వం ఏడేళ్లలో ఢిల్లీ ముఖచిత్రాన్ని మార్చేసిందని, అదే కాలం అస్సాంలో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం బురద రాజకీయాలు తప్ప ఇంకేమీ చేయలేకపోయిందని ఆయన ధ్వజమెత్తారు.

ఢిల్లీ, పంజాబ్‌లో ఉన్న ఆప్ ప్రభుత్వాలు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాయని, ఢిల్లీ లోని 12 లక్షల మంది, పంజాబ్‌లోని 28,000 మంది లబ్ధి పొందుతున్నారని, అదే విధంగా అస్సాంలో జరుగుతుందని ఆయన ఇక్కడ నిర్వహించిన ర్యాలీలో హామీ ఇచ్చారు. ఏడాది లోగా అస్సాంలో ప్రతి ఇంటికి పైపు లైను ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. “ఢిల్లీలో ఆప్ 2015లో అధికారం లోకి వచ్చింది. అస్సాంలో 2016 నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఈరోజు మేం ఢిల్లీ చిత్రాన్ని మార్చగలిగాం. మరి అస్సాంలో ఏడేళ్లలో హిమంతబాబు ( అస్సాం ముఖ్యమంత్రి) ఏం చేయగలిగారు ? కేవలం బురద రాజకీయాలు తప్ప ఇంకేం లేదు ” అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News