Friday, January 24, 2025

జిహెచ్ఎంసిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సర్కిల్ 19 యూసఫ్ గూడ పరిధిలోని బోరబండ సైట్ 2 లో ఎస్ఎఫ్ఎ గా పనిచేస్తున్న శ్రీనివాస్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. ఆయన కింద పనిచేసే కొంతమంది మహిళలను బెదిరించి ఉద్యోగం మాన్పించాలనే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వారి స్థానంలో కొత్త వారిని పెట్టుకునేందుకు శ్రీనివాస్ ఇప్పటికే లక్షల్లో వసూలు చేశాడు. నిత్యం వివాదాల్లో ఉండే శ్రీనివాస్ పై ఇటీవల బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. శానిటేషన్ సిబ్బంది రాకపోయినప్పటికీ సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. పనిచేసినట్లుగా సంతకాలు పెట్టుకుని శ్రీనివాస్ జీతాలు కొట్టేస్తున్నారు. ఇప్పటికైనా ఎస్ఎఫ్ఎ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News