Wednesday, January 22, 2025

సిమెంట్ ఫ్యాక్టరీలో యువతకు ఉద్యోగాలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా యువతకు సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్స్ 4వ ప్లాంట్‌కు దేవాపూర్‌లో రూ. 2000 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులకు కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. దేవాపూర్‌ను మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సింగరేణి భవనాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటుకు ఎంఎల్‌ఎ చిన్నయ్య, కలెక్టర్‌కు మంత్రి కెటిఆర్ ఆదేశించారు.

Also Read: కర్నాటక అసెంబ్లీ ఫైట్: వరుణలో కురువృద్ధుల కుస్తీ

కంపెనీ విస్తరణ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుందని వివరించారు. గ్రామీణ తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ ద్వారా ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి వెంకటేశ్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎంఎంల్‌ఎలు దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎంఎల్‌సి దండే విఠల్, మాజీ ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణరావు, కలెక్టర్ సంతోష్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News