Wednesday, January 22, 2025

ఉద్యోగాల పేరుతో మోసాలు

- Advertisement -
- Advertisement -

అండగా అధికారులు
డబ్బులు ఇచ్చి ఇంటి చుట్టు ప్రదర్శన చేస్తున్న నిరుద్యోగులు

మన తెలంగాణ/ములుగు న్యూస్: ములుగు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ వ్యక్తి జిల్లా కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబాలకు గిరి గిరి ఇస్తూ వారి భూమిని కబ్జా చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ వ్యక్తి గిరి గిరిల పేరుతో కుటుంబాలను మోసం చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొన్ని సంవత్సరాలుగా వారి వద్ద లక్షల్లో డబ్బులు గుద్దుతూ అలాగే అమాయకులను చూసి వారికి ఎంత భూమి ఉందో తెలుసుకొని వారికి తెలవకుండానే అధికారుల ప్రమేయంతో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు.

ఇది కొన్ని సం వత్సరాలుగా జరుగుతున్న బయటపడని వైనం. అధికారుల అండ ఉంది కనుకే ఈ గిరి గిరి వ్యవస్థ వ్యక్తి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అయినా గాని సంబంధిత అధికారుల చూసి చూడనట్లు ఉండడం వలన జిల్లా కేంద్రంలో సర్వే నెంబర్ 189/బి అనే భూమి 364 చదరపు గజాలు ఉండేది. ఆ కుటుంబానికి చెందిన ఓ పెద్ద మనిషి తాతయ్య ఆస్తి మనవలకే చెందుతుందనేది అందరికి తెలిసిన విషయమే కానీ, ఆ కుటుంబానికి ఈ ప్రయివేట్ వ్యక్తి గిరి గిరి ఇచ్చి వారి వద్ద నుండి అధికారుల ప్రమేయంతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ అన్నదమ్ములు ఆలస్యంగా తెలుసుకోవడంతో ఇప్పుడు ఆ గిరి గిరి వ్యక్తి వారిని బెదిరిస్తున్నాడు.

అది గమనించిన ఆ కుటుంబ సభ్యులు ఈ నెల 28 న సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో కలెక్టర్‌కు దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ వ్యక్తి ఫైనాన్స్ మోసంతో కుటుంబాలను ఆగం చేస్తూ వారి వద్ద నున్న భూమిని వారికి తెలవకుండానే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా మా భూమిని మాకు సంబంధిత అధికారులు ఇప్పించి మాకు న్యాయం చేయాలని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు: జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో జీవంత్రాలపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్యోగాలు ఇస్తానంటే లక్షల్లో డబ్బులు అతనికి ముట్టజెప్పారు. కానీ వారికి ఉద్యోగాలు ఇప్పించడం లేదని, అలాగే తీసుకున్న డబ్బు సైతం బాధితులకు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతున్నాడన్నారు. మధ్యవర్తులతో పంచాయతీలు జరుపుతూ వారిని మభ్యపెడుతున్నాడని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News