Sunday, January 19, 2025

గాజాలో ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలి: జో బైడెన్

- Advertisement -
- Advertisement -

మిన్నియాపొలిస్: ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరాటం కారణంగా గాజాలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో దాడులను ఆపాలంటూ పలు ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మిన్నియాపొలిస్‌లో నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. పాల్గొన్నారు. అక్కడ ఓ మహిళ ‘ మీరు కాల్పుల విరమణకు ఇప్పుడే పిలుపునివ్వాలి’ అని అధ్యక్షుడిని ఉద్దేశించి గట్టిగా కేకలు వేశారు.దానికి బౌడెన్ బదులిచ్చారు. ‘విరామం అవసరమని భావిస్తున్నాను. బందీలనుబయటకు తీసుకురావడానికి సమయం ఇవ్వాలి’ అని అన్నారు.

ఈ క్రమంలో ఆయన బందీలు అని కాకుండా ‘ఖైదీలు’ అనే పదం వాడారు.దీనిపై తర్వాత శ్వేత సౌధం వివరణ ఇచ్చింది. బైడెన్ మాట్లాడింది బందీల గురించేనని స్పష్టత ఇచ్చింది.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన ఉగ్రదాడిలో 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా బందీలుగా మారారు. గాజాలో ఉన్న వీరిని చర్చల ద్వారా విడిపించాలని పలు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం హమాస్‌ను తుదముట్టించేదాకా యుద్ధం ఆపేది లేదని తెగేసి చెప్తోంది.అమెరికా సైతం ఇజ్రాయెల్ వైఖరికే ఇప్పటిదాకా మద్దతు ఇస్తూ వచ్చింది. తాజాగా యుద్ధానికి విరామం ఇవ్వాలని బైడెన్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News