Thursday, January 23, 2025

రష్యాపై మరో 500 ఆంక్షలు: బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : రష్యాపై అమెరికా ఆంక్షలు తీవ్రతరం అయ్యాయి. ఉక్రెయిన్ , రష్యా యుద్ధం రెండో సంవత్సరంలోకి చేరుకున్న దశలో అధ్యక్షులు జో బైడెన్ నుంచి శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. రష్యాపై మరో 500కు పైగా ఆంక్షలు విధిస్తామని బైడెన్ సూచనప్రాయంగా తెలిపారు. రష్యాపై పలు విధాలుగా ఒత్తిడి తీసుకురావడం ఈ చర్యల్లో భాగం అని వివరించారు. ఎగుమతులపై మరిన్ని నిషేధాలు విధిస్తారు. పలు విధాలుగా రష్యా ఇంధన వనరుల ఆదాయాన్ని తగ్గించడం తమ లక్షం అని బైడెన్ తమ ప్రకటనలో తెలిపారు. ఇటీవల రష్యా జైలులో ప్రతినక్ష నేత నావల్ని మృతికి పుతిన్‌ను బాధ్యుడిగా చేసి తగు విధంగా ప్రపంచ దేశాలు స్పందించేందుకు కూడా తాము చర్యలు తీసుకుంటామని బైడెన్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News