Monday, December 23, 2024

మళ్లీ జోబైడెన్ తడబాటు…తలపట్టుకున్న డెమోక్రాట్లు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ డెమోక్రాట్లలో టెన్షన్ పెరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ ప్రసంగంలో తడబాట్లతో నవ్వుల పాలవుతున్నామనే భయం వారిని పీడిస్తోంది. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై దాడి నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కూడా ఆయన తప్పులు మాట్లాడారు. తమ విభేదాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకొంటాం’ అని చెప్పాల్సి ఉండగా, బ్యాటిల్ బాక్సుల్లో (యుద్ధపు పెట్టెల్లో ) పరిష్కరించుకొంటామన్నారు.

నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా బైడెన్ మీడియాతో మాట్లాడారు. “మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలగితే ట్రంప్‌ను కమలాహ్యారిస్ ఓడించగలరని భావిస్తున్నారా” అని పాత్రికేయులు ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ “అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్‌నకు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్ణి కాదు” అని బదులిచ్చారు. పొరపాటున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనాల్సిందిపోయి ట్రంప్ అనేశారు. ఈ సమావేశానికి ముందు నాటో కూటమి సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని బైడెన్ పరిచయం చేశారు. ఆ సమయంలో జెలెన్‌స్కీని ఆహ్వానిస్తూ “అధ్యక్షుడు పుతిన్‌” అని సంబోధించారు. దీంతో సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నిట్టూర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News