న్యూయార్క్: రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా సమావేశమైంది. ఐక్యరాజ్య సమితి అత్యవసర భేటీకి వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని రష్యా ఉల్లంఘించిందన్నారు. రష్యా చర్యలపై ఐక్యంగా ప్రతిస్పందిస్తామని ఐక్యరాజ్యసమితితో అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న సైనిక దాడిని ఆపాలని, సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని అమెరికా సూచించింది. దౌత్యవేత్తలు ఐక్యరాజ్యసమితి వేదికగా చర్చలకు రావాలని అమెరికా పిలుపునిచ్చింది. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు గమనిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తెలిపారు. శుక్రవారం జి-7 దేశాలతో జో బైడెన్ సమావేశం కానున్నారు. నాటో కూటమికి సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అన్యాయమైన దాడులతో ఉక్రెయిన్ ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, ముందస్తుగా నిర్ణయం తీసుకుని పుతిన్ యుద్ధానికి దిగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ చర్య తీవ్రమైన విపత్తుకు మానవాళి నష్టానికి దారి తీస్తుందన్నారు.
ప్రశాంత ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం సృష్టించారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మ్రంతి తెలిపారు. తమను తాము రక్షించుకొని విజయం సాధిస్తామన్నారు. రష్యా ఆక్రమణను ఆపాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.