Sunday, December 22, 2024

కట్టుకథల వేదికకు మస్క్ బాస్ అన్నమాట

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్‌పై బైడెన్ ఘాటు స్పందన

వాషింగ్టన్ : ట్విట్టర్ కట్టుకథల పుట్టిల్లు, వాస్తవాలకు బురదచల్లుతుంది, అసత్యాలను ప్రచారం చేస్తుందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న అంశంపై బైడెన్ స్పందించారు. చికాగోలో జరిగిన నిధుల సమీకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. ప్రపంచంపైకి అసత్యాల బురద చల్లే వేదిక ఏదైనా ఉందంటే అది ట్విట్టరే అని తీవ్రంగా మండిపడ్డారు. ఇక మస్క్ దీనిని హస్తగతం చేసుకున్నారనే విషయంపై మాట్లాడేందుకు ఏమీ లేదని బదులిచ్చారు. ట్విట్టర్ పేరుకు సమాచార అంతర్జాలం అయితే దీనికి ఎడిటర్లు అంటూ ఎవరూ ఉండరు. అంతా బురద చల్లే బాధ్యతలు తీసుకున్న వారే అని ఘాటుగా చమత్కరించారు.

ట్విట్టర్ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను మస్క్ కొత్త యాజమాన్యం దశలో తీసివేసిన తరువాత రోజు బైడెన్ ట్విట్టర్‌పై ఫైర్ అయ్యారు. గత వారం మస్క్ అత్యంత భారీ స్థాయిలో 44 బిలియన్ల డాలర్ల ధరకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఇందులో పలు మార్పులు చేర్పులకు సిద్ధం అవుతున్నారు. విధాన నిర్ణయాలకు కసరత్తు చేస్తున్నారు. బ్లూటిక్ ప్రక్రియకు 8 డాలర్లు రుసుం పెట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటివరకూ ట్విట్టర్‌లో కీలక బాధ్యతలలో ఉంటూ వచ్చిన వారిని తీసివేశారు. ఎక్కువ మంది ఉద్యోగులను తీసివేసిన అంశంపై బైడెన్ స్పందించారు. పాత సిబ్బందిని తీసివేసి మరింతగా అబద్ధాలు ప్రచారం చేయగలిగే వారిని వెతుక్కుంటారని మస్క్‌పై మండిపడ్డారు. ప్రపంచానికి ఇదో అబద్ధాల పాము పుట్ట వంటిదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News