Sunday, December 22, 2024

జి20 సదస్సుకు జిన్‌పింగ్ రాకపోవడం నిరాశ కలిగించింది : జోబైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఈ వారం భారత్ పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, కానీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ న్యూఢిల్లీ లోని జి20 సదస్సుకు రావడం లేదని తెలిసి నిరాశ పరిచిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. జి20 సదస్సుకోసం బైడెన్ సెప్టెంబర్ 7న భారత్‌కు రానున్నారు. చారిత్రాత్మకమైన సమావేశంపై సెప్టెంబర్ 8న భారత ప్రధాని మోడీతో భేటీ అవుతారు. భారత్ పర్యటనకు ముందుగా విలేఖరులు బైడెన్‌ను భారత్, వియత్నాం పర్యటనల గురించి అడిగారు. జిన్‌పింగ్ రాకపోవడం నిరాశ కలిగించిందని, కానీ ఆయనను కలుసుకోడానికి తాను వెళ్తానని బైడెన్ పేర్కొన్నారు.

కానీ వీరి సమావేశం ఎక్కడ జరుగుతుందనే సమాచారం బైడెన్ వెల్లడించలేదు. బాలిలో జి20 సదస్సు జరిగినప్పుడు 2022 నవంబర్‌లో బైడెన్, జిన్‌పింగ్ వ్యక్తిగతంగా సమావేశమై చర్చించుకున్నారు. ఉద్రిక్తతల నివారణకు పరస్పరం చర్చించుకోవాలని ఆనాడు నిర్ణయించుకున్నారు. జోబైడెన్‌తోపాటు ఫ్రెంచి అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ , బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో, తదితరులు జి20 సదస్సుకు హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News