- Advertisement -
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ అధికారికంగా ఎన్నికయ్యారు. అటు ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఖరారయ్యారు. అమెరికా కాంగ్రెస్ బైడెన్, కమల విజయాన్ని ధ్రువీకరించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఓటమిని అంగీకరించాడు. అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు పొందాల్సి ఉంది. గతేడాది నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రాటిక్ నేత జో బైడెన్ కు 306 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నెల 20న అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
- Advertisement -