Monday, January 20, 2025

జో బైడెన్ ప్రపంచ నేతల లెక్కలోనే లేరు

- Advertisement -
- Advertisement -

రియోలో జి20 సమ్మిట్‌కు ఆయనకు చివరిది
రియో డి జనీరో : యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ పలువురు ప్రపంచ అధినేతల దృష్టిలో లేనే లేరన్న అనుమానం ఏదైనా ఉన్నట్లయితే, రియో డి జనీరోలో ఆయన చివరి జి20 శిఖరాగ్ర సదస్సు అందుకు కచ్చితమైన సంకేతం. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు తిరిగి వచ్చే లోపే ఉక్రెయిన్, గాజా నుంచి పర్యావరణ మార్పు వరకు అంశాలపై ప్రపంచం మద్దతు కోసం బైడెన్ చివరి సారి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆయన సమకాలికులు బ్రెజిలియన్ నగరం పక్కన అధికారిక జి20 ఫోటో కోసం సమీకృతం కాగా, 81 ఏళ్ల బైడెన్ అక్కడికి రాకపోవడం సమస్యగా మారింది.

యుఎస్ అధ్యక్షునికి బదులు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయి ఇనాషియో లూలా డ సిల్వా ముందు వరుసలో జోకులు వేసుకుంటూ, ముచ్చట్లాడి, తరువాత కలసి ఫోటోకు పోజు ఇచ్చారు. నిస్పృహ వహించిన అమెరికన్ అధికారులు దానికి ‘ప్రయాణ సంబంధిత సమస్యలు’ కారణమని అన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో చర్చల అనంతరం బైడెన్ ఆ ప్రాంతానికి ఇంకా చేరుకోక ముందే ఫోటో తీశారని వారు ఆరోపించారు. ‘నేతలు అందరూ వచ్చే లోగానే వారు ఫోటో తీయించుకున్నారు. దానితో అనేక మంది నేతలు అక్కడ లేకపోయారు’ అని పేరు వెల్లడి చేయరాదనే షరతుతో యుఎస్ అధికారి ఒకరు చెప్పారు. ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా అక్కడ లేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News