- Advertisement -
ట్రంప్ హయాంలోని నిర్ణయాన్ని రద్దు చేసిన బైడెన్ : కొత్త ఉత్తర్వులు జారీ
వాషింగ్టన్ : సైన్యంలో లింగమార్పిడి (ట్రాన్స్‌జెండర్) వ్యక్తులు చేరడాన్ని నిషేధిస్తూ ట్రంప్ హయాంలో ప్రవేశ పెట్టిన విధానాన్ని తారుమారు చేస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. రక్షణ కార్యదర్శి లాయ్‌డ్ ఆస్టిన్‌తో జరిగిన సమావేశంలో ఈమేరకు బైడెన్ నిర్ణయం తీసుకుని కొత్త ఉత్వర్వు జారీ చేశారు. ఈమేరకు ఉత్తర్వుపై సంతకం చేస్తూ బైడెన్ అర్హులైన అమెరికన్లు అందరూ తమ దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా స్వదేశం లోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద బలమైన దేశమని ఇందులో మిలిటరీకి మినహాయింపు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వు మిలిటరీ, కోస్ట్ గార్డుల్లో అమలయ్యేలా చూడాలని రక్షణ, హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగాలకు ఆదేశించారు.
- Advertisement -