Friday, November 22, 2024

మోడీతో హక్కులు, మీడియా స్వేచ్ఛ ప్రస్తావన

- Advertisement -
- Advertisement -

హనోయ్ : భారత ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కీలక ప్రస్తుత చర్చనీయాంశాలనే ప్రస్తావించారని వెల్లడైంది.  భారతదేశ ఆతిధ్యంలో ఢిల్లీలో జరిగిన జి 20 సదస్సులో పాల్గొని బైడెన్ వియత్నాం పర్యటనకు వచ్చారు. ప్రధాని మోడీతో ముఖాముఖీ చర్చలలో మానవ హక్కుల పట్ల సమాదరణ, సభ్య సమాజ పాత్ర, స్వేచ్ఛాయుత పత్రికా వ్యవస్థ వంటి ముఖ్యమైన విషయాలను ప్రస్తావించినట్లు బైడెన్ వియత్నాంలో జరిగిన ప్రెస్ మీట్‌లో తెలిపారు.

ప్రధాని మోడీని కలిసినప్పుడల్లా చెపుతున్నట్లుగానే ఈసారి కూడా హక్కుల విషయం, పౌర సమాజం మహత్తర భూమిక వంటి అంశాలను మాట్లాడినట్లు తెలిపిన బైడెన్ పటిష్టం , సుభిక్షమైన దేశ నిర్మాణం గురించి మాట్లాడినట్లు వివరించారు. తమ మధ్యలో చాలా ముఖ్యమైన విషయాలు ప్రస్తావనకు వచ్చాయని మీడియాకు తెలిపారు. జి 20 సమ్మిట్ భారత్ సారధ్యంలో బాగా సాగిందని తెలిపిన బైడెన్ ఈ కూటమి లక్షాల సాధనకు ఇది కీలకం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News