Friday, November 22, 2024

గెల్వని యుద్థానికి ఇంక సెలవు

- Advertisement -
- Advertisement -

Joe Biden says US war in Afghanistan will end on August 31

ఆగస్టు 31తో అమెరికా అఫ్ఘన్ వార్ సమాప్తం
తాలిబన్లు కవ్వించినా తేల్చిచెప్పిన బైడెన్
ఆ దేశ నిర్మాణంతో సంబంధం లేదు

వాషింగ్టన్ : అఫ్ఘనిస్థాన్‌లో తమ దేశపు 20 సంవత్సరాల యుద్ధం ఆగస్టు 31తో ముగుస్తుందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా అఫ్ఘన్‌లో ఆపరేషన్‌ను ముగించుకోవాలని, తమ సైన్యాన్ని దశలవారిగా అక్కడి నుంచి ఎత్తివేయడం జరుగుతోందని ప్రెసిడెంట్ చెప్పారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఆగస్టు 31తో పూర్తి అవుతుందని, ఈ దిశలో చేపట్టే చర్యలు మరింతవేగవంతం చేయడమే తమకు శ్రేయస్కరం అని తెలిపారు. వైట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దాదాపు 20 ఎళ్లుగా అక్కడ అమెరికా సేనలు శాంతి పరిరక్షణ దిశలో పాటుపడుతూ వచ్చాయి. ఇక తమ బాధ్యతకు గడువు ముగిసిందని, అఫ్ఘనిస్థాన దేశ పునర్నిర్మాణం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని బైడెన్ స్పష్టం చేశారు. ఇది ఆ దేశపు నేతల విషయం అని, వారంతా కలిసికట్టుగా వ్యవహరించి , సరైన దేశ భవిత కోసం ముందుకు సాగాల్సి ఉందన్నారు.

అమెరికా సేనలు ఇటీవలే అత్యధిక సంఖ్యలో అఫ్ఘన్ వైమానిక స్థావరపు బస నుంచి నిష్క్రమించాయి. అయితే ఇటీవలి కాలంలో దేశంలో పలు చోట్ల తాలిబన్ల దాడులు పెరగడం , మునుపటి పరిస్థితి తలెత్తుందనే భయాందోళనపై బైడెన్ స్పందించారు. సైనిక ఆపరేషన్ తమ దేశానికి సంబంధించినంత వరకూ ముగిసినట్లే, అక్కడి నుంచి వైదొలగాలనే తమ నిర్ణయం అన్ని విధాలుగా సబబే అని బైడెన్ తెలిపారు. అఫ్ఘన్‌లో తమది విజయసాధ్యం కాని యుద్ధం అవుతుందని, అక్కడ ఎంత కాలం సేనలు తిష్టవేసుకున్నా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడం కుదరదని, సైనిక చర్యతో పరిష్కారం కాని విషయాలు చాలా ఉంటాయి. అందులో అఫ్ఘన్ అంశం ఒకటని బైడెన్ పదేపదే చెపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి అమెరికా సేనలు పూర్తి స్థాయిలో వైదొలగడానికి రంగం సిద్ధం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News