Sunday, December 22, 2024

డౌటేలేదు జిన్‌పింగ్ నియంతే : బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ డిక్టెటర్ అని , ఆయన మారడు అని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన చైనా నేతతో సమావేశం అయిన కొద్ది సేపటి తరువాత బైడెన్ స్పందించారు. ఈ ఏడాది ఆరంభంలో బైడెన్ చైనా అధినేతను తిట్టిపోశారు. ఇప్పుడు కూడా తాను ఆయన గురించి ఇదే మాట అంటానని , నియంతనే అని వ్యాఖ్యానించారు. డిక్టేటర్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన ఈ విధంగా ఉండాల్సిందే. ఇది ఆయనకు అనివార్యం. కమ్యూనిస్టు దేశం అయిన చైనా పాలనా పగ్గాల వ్యక్తి పద్ధతి మరో విధంగా ఉండటానికి వీల్లేదు. అక్కడి ప్రభుత్వ స్వరూపం, పాలనా విధానాలు పూర్తిగా ఇతర దేశాలకు విరుద్ధం అని బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాకు చైనాకు ఎంతో వ్యత్యాసం ఉందని, ఈ క్రమంలో ఆయనను తాను డిక్టెటర్ అనే అంటానని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News