వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌కు మరోసారి కరోనా సోకింది. ఆయనకు కొవిడ్ 19 వైరస్ పాజిటివ్ అని వైద్యపరీక్షలలో శనివారం నిర్థారణ అయింది. మూడు రోజుల క్రితమే కరోనావైరస్ ఐసోలేషన్ నుంచి ఆయన బయటపడ్డారు. యాంటీ వైరల్ డ్రగ్ ద్వారా సమగ్ర చికిత్స జరిగి ఆయన కోలుకున్నట్లు లక్షణాలు ద్యోతకమైన తరువాత తిరిగి పాజిటివ్ నిర్థారణ కావడం అసాధారణం అయిందని వైట్‌హౌస్ అధికార వర్గాలు శనివారం ఓ ప్రకటన వెలువరించాయి. తిరిగి ఆయన ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. ప్రెసిడెంట్‌కు తిరిగి వైరస్ సోకిన విషయం నిర్థారణ అయింది. అయితే ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. తిరిగి విశ్రాంతి తీసుకుంటారని వైట్‌హౌస్ ప్రత్యేక డాక్టరు కెవిన్ ఓ కాన్నోర్ తెలిపారు. తిరిగి చికిత్స అవసరం లేదని ఐసోలేషన్‌తో సరిపోతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. కనీసం ఆయన ఐదు రోజులు ఐసోలేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. తిరిగి వైరస్ లేదని నిర్థారణ అయ్యేవరకూ వైట్‌హౌస్‌లోనే విశ్రాంతి పొందుతారని వివరించారు. ఒక్కోసారి కరోనా వచ్చి తగ్గి తిరిగి సోకిన వారిలో లక్షణాలు స్వల్పస్థాయిలోనే ఉంటాయని, తీవ్ర సమస్యలు తలెత్తిన ఉదంతాలు లేవని తెలిపారు.
శునకం కమాండర్‌తో బైడెన్
ఐసోలేషన్‌కు వెళ్లిన బైడెన్ విశ్రాంతి దశలో ఓ ట్వీటు వెలువరించారు. వైట్‌హౌస్ లాన్స్‌లో ఆయన తన పెంపుడు కుక్క కమాండర్‌తో పాటు ఉన్నప్పటి 12 సెకండ్ల వీడియో వెలువరించారు. తన చేతిలో ఏవియేటర్ సన్‌గ్లాస్‌లతో ఆయన ఉన్నారు. తాను కమాండర్ కలిసి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Joe Biden test positive for Covid 19 Again