- Advertisement -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కొవిడ్ పాజిటివ్ సోకింది. స్వల్ప దగ్గు,జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని వైట్‌హౌస్ బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసొలేషన్‌లో ఉన్నట్టు వెల్లడించింది. ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారని, కొవిడ్ స్వల్ప లక్షణాలే కనిపించాయని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేరైన్ జీన్ పియెర్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం యునిడోస్ ప్రచారంలో ఆయన ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ అర్ధంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్‌కు బయలుదేరారు. డెలావేర్ బయలుదేరుతూ తాను బాగానే ఉన్నానని విలేఖరులకు చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ వన్ లోకి ఎక్కేటప్పుడు బైడెన్ మాస్క్ ధరించి లేకపోవడం గమనార్హం.
- Advertisement -