వాషింగ్టన్: ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్ష హోదాలో బైడెన్ తొలిరోజు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయనున్నారు. ట్రంప్ హయాంలో వివాదాస్పద నిర్ణయాలను రద్దు చేసే అవకాశముంది. బాధ్యతలు చేపట్టాక 12 కీలక ఫైల్ లపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. పారిస్ ఒప్పందంలో చేరడం, కొవిడ్ ఆంక్షల విస్తరణపై ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. ముస్లిం దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధం ఎత్తివేయనున్నట్టు సమాచారం. కరోనా వ్యాప్తి అరికట్టడం, విద్యా సంస్థలు తెరిచే అవకాశాలపై దృష్టి పెట్టనున్నారు. కరోనా పరీక్షల పెంపు, కరోనా యోధులకు మరింత రక్షణ కల్పనపై నిర్ణయం తీసుకోనున్నారు. 100 రోజుల మాస్క్ తప్పనిసరి చేసే దిశగా బైడెన్ చర్యలు తీసుకోనున్నారు. కోటికిపైగా వలసదారులకు పౌరసత్వం కల్పనపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. తొలిరోజు ఇమ్మిగ్రేషన్ బిల్లును కాంగ్రెస్ కు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.