Sunday, December 22, 2024

గూఢచారిని కరిచిన బైడెన్ పెంపుడు శునకం

- Advertisement -
- Advertisement -

వాషషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు శునకం వైట్ హౌస్‌లో అమెరికా గూఢచారి సంస్థ అధికారిని సోమవారం ఉదయం కరిచింది. బైడెన్ పెంపుడు శునకం రెండేళ్ల జర్మన్ షెపర్డ్ కమాండర్ వైట్ హౌస్‌లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను కరవడం ఇది 11వ సారి.

‘సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వైట్ హౌస్‌లో విధి నిర్వహణలో ఉన్న సీక్రెట్ సర్వీస్ డివిజన్ పోలీసు అధికారిపై కమాండర్ దాడి చేసి కరిచినట్లు వైట్ హౌస్ తెలిపింది. కుక్క కాటుకు గురైన అధికారికి వైట్ హౌస్ కాంప్లెక్స్‌లోని వైద్య సిబ్బంది చికిత్స చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్(యుఎస్‌ఎస్‌ఎస్) కమ్యూనికేషన్స్ చీఫ్ ఆంటోని గుగ్గీమీమి వెల్లడించినట్లు సిఎన్‌ఎన్ వార్తాసంస్థ తెలిపింది. గాయపడిన అధికారి తమ డివిజన్ చీఫ్ ఆల్ఫన్సన్ ఎం డైసన్ సీనియర్‌తో మంగళవారం మాట్లాడారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు.

వైట్ హౌస్‌లో అధికారులపై కమాండర్ దాడి చేయడం ఇది 11వ సారి. గత ఏడాది నవంబర్‌లో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారి చేతులు, తొడలపై కమాండర్ చేసిన గాయాలకు ఆ అధికారి ఆసుపత్రి పాలయ్యాడు.

కాగా..అధికారుల పట్ల ఎలా మసలుకోవాలో కమాండర్‌కు బైడెన్ కుటుంబ సభ్యులు జులై నుంచి శిక్షణ ఇస్తున్నట్లు వైట్ హౌస్ అధికారులు చెప్పారు. కమాండర్‌కు ముందు బైడెన్ కుటుంబానికి వైట్ హౌస్‌లో మేజర్ అనే మరో పెంపుడు శునకం ఉండేది. అది కూడా తన పళ్లకు పనిచెప్పి అధికారులను గాయాలు పాలుచేసింది. దాంతో దాన్ని వేరే చోటుకు తరలించి దాని స్థానంలో కమాండర్‌ను బైడెన్ దంపతులు వైట్ హౌస్‌కు తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News