Monday, December 23, 2024

జో బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం!

- Advertisement -
- Advertisement -

Joe Biden

మాస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భార్య, కుమార్తెతోపాటు మరో 23 మంది అమెరికన్‌లపై రష్యా నిషేధం విధించినట్లు రష్యా విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది. “రష్యన్ రాజకీయ ,  ప్రజా ప్రముఖ వ్యక్తులపై నిరంతరం విస్తరిస్తున్న అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగా, 25 మంది అమెరికన్ పౌరులు ‘స్టాప్ లిస్ట్’కు జోడించబడ్డారు” అని మంత్రిత్వ శాఖ జాబితాతో పాటు ఒక నోట్‌లో పేర్కొంది. మైనేకి చెందిన సుసాన్ కాలిన్స్, కెంటకీకి చెందిన మిచ్ మెక్‌కానెల్, అయోవాకు చెందిన చార్లెస్ గ్రాస్లీ, న్యూయార్క్‌కు చెందిన కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్‌లతో సహా పలువురు అమెరికా సెనేటర్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఇందులో పలువురు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, మాజీ అమెరికా ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News