Monday, December 23, 2024

రూట్ ఓ అద్భుత ఆటగాడు: సౌరవ్ గంగూలీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌పై భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో రూట్ ఒకడని ప్రశంసించాడు. అతనిలాంటి క్రికెటర్ చాలా అరుదుగా లభిస్తారని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో లార్డ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రూట్ ఆడిన ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే తీపి జ్ఞాపికంగా మిగిలిపోతుందన్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ రూట్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో అది కూడా రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకం సాధించడం చాలా అద్భుతమన్నాడు. మరి కొన్నేళ్లపాటు రూట్ ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగడం ఖాయమని గంగూలీ జోస్యం చెప్పాడు.

Joe Root is all time great says Sourav Ganguly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News