Friday, November 15, 2024

భారీ మూల్యం చెల్లించుకున్నాం..

- Advertisement -
- Advertisement -

Joe Root is deeply saddened by defeat in second Test

జో రూట్

లండన్: భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఘోర పరాజయం పాలు కావడంపై ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో వ్యూహాత్మక తప్పిదాలు చేసి భారీ మూల్యమే చెల్లించుకున్నామన్నాడు. ఇక బుమ్రా, షమిలను తాము తక్కువ అంచనా వేయడం కూడా ప్రతికూలంగా మారిందన్నాడు. వారిని అంత సేపు ఆడనిచ్చి ఉండేది కాదన్నాడు. కానీ ఆ ఇద్దరిపై తమ అభిప్రాయం చాలా తప్పని త్వరలోనే స్పష్టమైందని, అప్పటికే తీరని నష్టం జరిగిపోయిందన్నాడు. కెప్టెన్‌గా నేను కొన్ని పొరపాట్లు చేశాను. వ్యూహాత్మకంగా కొన్ని భిన్నమైన మార్పులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం కచ్చితంగా వేరేగా ఉండేది. కానీ తాను మాత్రం సరైన వ్యూహం రచించడంలో విఫలమయ్యానని రూట్ వాపోయాడు. తాను తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ అనూహ్యంగా కోలుకుందన్నాడు.

దీంతో జట్టు ఓటమికి కెప్టెన్‌గా తానే పూర్తి బాధ్యతను తీసుకుంటున్నానని స్పష్టం చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో తాను మరి కొంత సేపు క్రీజులో ఉన్నట్లయితే మిగతా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగేదన్నాడు. కానీ తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో ఇతర ఆటగాళ్లు కూడా పెవిలియన్ బాట పట్టారన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆట తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ముఖ్యంగా బౌలర్లు అసాధారణ రీతిలో చెలరేగి పోయారన్నాడు. బుమ్రా, ఇషాంత్, షమి, సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తమకు కోలుకునే అవకాశం ఇవ్వలేదన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా, సిరాజ్, ఇషాంత్ బౌలింగ్‌ల అద్భుతంగా ఉందన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన తమ సిరీస్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయన్నాడు. రానున్న మ్యాచుల్లో మెరుగైన ఆటతో మళ్లీ గాడిలో పడతామనే ధీమాను రూట్ వ్యక్తం చేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News