Sunday, January 19, 2025

ఆ రికార్డు సాధిస్తే టెస్టు క్రికెట్‌కు ఎంతో మేలు

- Advertisement -
- Advertisement -

ముంబై: టెస్టు క్రికెట్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డుకు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సమీపించిన విషయం తెలిసిందే. ఇటీవల వరుస సెంచరీలతో అదరగొడుతున్న రూట్ సచిన్ సాధించిన 15.921 పరుగుల రికార్డుకు దగ్గరలోకి వచ్చాడు. మరో 3500 పరుగులు చేస్తే సచిన్ పేరిట ఉన్న రికార్డును రూట్ బద్దలు కొడుతాడు. ప్రస్తుతం రూట్ ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఈ రికార్డును అందుకోవడం కష్టమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం నెలకొంది. జో రూట్ ఈ రికార్డును సాధించకుండా భారత క్రికెట్ బోర్డు అడ్డుకుంటుందని వాన్ అభిప్రాయపడ్డాడు. సచిన్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ కాకుండా బిసిసిఐ తన అధికారాన్ని అన్ని విధాలా ఉపయోగిస్తుందన్నాడు. కాగా, వాన్ వ్యాఖ్యాలపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఇంగ్లండ్ బ్యాటర్ రూట్ ఈ రికార్డు సాధిస్తే టెస్టు క్రికెట్‌కు ఎంతో మేలు జరుగుతుందన్నాడు. తాను కూడా రూట్ ఈ రికార్డును బద్దలు కొట్టాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. రూట్ దీన్ని సాధిస్తే అది సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు బూస్ట్‌ల పనిచేస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News