లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్నీ నుంచి జో రూట్ తప్పుకున్నాడు. జోరూట్ 2017లో కెప్టెన్నీ బాధ్యతలు తీసుకున్నాడు. ఐదేళ్లపాటు ఇంగ్లండ్ టెస్టు జట్టుకు సారథిగా వ్యవహరించారు. ఆస్ట్రేలియా, కరేబియన్ పర్యటనల కారణంగా పేలవమైన ఫలితాలు రావడంతో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించాడు. ప్రస్తుతం ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్ గా బాధ్యతలు వహిస్తున్నాడు. 31 ఏళ్ల అతను 2017లో అలిస్టర్ కుక్ వారసుడిగా జో రూట్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు, విజయాలు సాధించిన రికార్డులను సృష్టించాడు. తన కెరీర్ లో చాలా సవాల్ తో కుడుకున్న నిర్ణయమని, ఐదేళ్ల పాటు సారథిగా ఉండటం గర్వంగా ఉందన్నాడు. రూట్ నాయకత్వంలో ఇంగ్లండ్ యాషెస్ తో పాటు భారత్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. టెస్టు కెప్టెన్‌గా జో రూట్ 5,295 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా 14 సెంచరీలు కొట్టాడు. 64 టెస్టులకు కెప్టెన్సీ చేపట్టగా, దాంట్లో 27 మ్యాచుల్లో విజయం సాధించాడు, మరో 26 మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జో రూట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -