- Advertisement -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ)లో ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ చరిత్ర సృస్టించాడు. 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో రూట్ ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్ లో 27 పరుగులు చేయడంతో ఈ మైలు రాయిని అందుకున్నాడు. మొత్తం 59 మ్యాచుల్లో రూట్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
డబ్ల్యూటీసీలో ఈ ఘనత సాధించిన వారిలో రూట్ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్లు మార్నస్ లాబుషాగ్నే(45 టెస్టుల్లో 3904 పరుగులు), స్మిత్(45 టెస్టుల్లో 3486 పరుగులు), ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ బెన్ స్టోక్స్(48 టెస్టుల్లో 3101 పరుగులు), పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్(32 టెస్టుల్లో 2755 పరుగులు)లు ఉన్నారు.
- Advertisement -