Monday, January 20, 2025

బాధ్యతలు స్వీకరించిన జోయల్ డేవిస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా నియామకమైన జోయల్ డేవిస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జోయల్ డేవిస్ సిద్దిపేట కమిషనర్‌గా, వెస్ట్‌జోన్ డిసిపిగా పనిచేశారు. సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్‌గా నియమితులయ్యారు. జాయింట్ సిపిగా నియమితులైన జోయల్ డేవిస్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అత్యంత కీలకం కావడంతో, కొత్త కమిషనర్ ట్రాఫిక్‌ను నియంత్రణపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గతంలో పనిచేసిన జాయింట్ సిపి ట్రాఫిక్ నియంత్రణలో విఫలం కావడంతో ఏకంగా పోలీస్ కమిషర్ స్టిఫెన్ రవీంద్ర రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News