Sunday, January 19, 2025

పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు: జోగి రమేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: 2014లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 650 వాగ్దానాలు చేసి గాలికొదిలేశారని వైసిపి ఎంఎల్ఎ జోగి రమేష్ విమర్శించారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. 650 వాగ్దానాల్లో 10 హామీలనైనా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్రే నకిలీ చరిత్ర అని, బాబు ఓ డర్టీ ఫెలో, దొంగ అని విమర్శించారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలోనే సిఎం జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారన్నారు. ఆల్ కాపీ బాబు, నకిలీ బాబుకు 2024లోనూ పరాభవం తప్పదని వైసిపి ఎంఎల్ఎ జోస్యంచెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసిపి సింగిల్‌గానే పోటీ చేస్తుందన్నారు. పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు అని, 14 ఏళ్లుగా సిఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఏమైందని? జోగి రమేష్ అడిగారు.

రుణమాఫీ అంటూ రైతులను చంద్రబాబు మోసం చేశారని, 2024లో ఎన్నికల్లో చంద్రబాబును బిసిలు తరిమి తరిమి కొడుతారని జోగి రమేష్ హెచ్చరించారు. పేదల రక్తాన్ని పీల్చిపిప్పి చేసిన వ్యక్తి చంద్రబాబు అని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకున్నారని, చంద్రబాబు వేషాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2024 ఎన్నికల తరువాత టిడిపి అడ్రస్ గల్లంతవుతుందని, మంత్రివర్గంలో ఒక్క బిసికైనా చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారా? అని జోగి రమేష్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News