Friday, December 20, 2024

చంద్రబాబువి శవ రాజకీయాలు: జోగి రమేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతీచోటా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. మంగళవారం జోగి మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిల్సిందిపోయి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయలు అందజేశామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాజకీయాలతో తమకు సంబంధంలేదని విద్యార్థి అమర్నాథ్ తల్లి చెప్పారన్నారు. ఎవరి ఇంట్లో కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు శవాల మీద పేలాలు ఏరుకోవడానికి వెళ్లారని, బాబు మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని జోగి దుయ్యబట్టారు.

Also Read: మహారాష్ట్రలో దారుణం: సంకెళ్లు వేసి కూలీలతో వెట్టిచాకిరీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News