- Advertisement -
పూణే విక్రేతకు సెల్యూట్ : జోగినపల్లి సంతోష్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ, దైవభక్తిని చాటుతూ పూణేకు చెందిన గణనాథుల విక్రేత స్ఫూర్తిదాయకమైన, సంప్రదాయానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సెల్యూట్ చేశారు. విశ్వాసం, పర్యావరణ వాదం యొక్క దివ్యసమ్మేళన చర్యగా అభివర్ణించారు. విక్రయించే ప్రతి గణేశ్ విగ్రహంతో పాటు, ఒక మొక్క ఉచితంగా అందజేస్తున్నారన్నారు. ఈ చర్య గణనాథుని ఉనికిని శాశ్వతంగా ఉంచుతుందన్నారు. దేవత కోసం పుష్పించే నివాళిగా దీనిని పెంపొందించడం, తాము జీవితకాల భక్తిని తరతరాలకు అందజేస్తామన్న నిర్వచనాన్ని పూణే విక్రత చాటి చెప్పగలిగారన్నారు. ఇందుకు సంబంధించిన ఇమేజ్‌ను ఎంపి సంతోష్ తన ట్విట్టర్‌లో పొందుపర్చారు.
- Advertisement -