Friday, November 22, 2024

విత్తన ‘గణపతింభజే’

- Advertisement -
- Advertisement -

Joginapally Santosh Kumar distributed seed Ganpati

హరిత భారతం కోసం అహరహం కృషి చేస్తున్న
గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో సోమవారం
నాడు హైదరాబాద్‌లోని పంజాగుట్టలోగల నెక్ట్స్
గలేరియా మాల్‌లో విత్తన గణపతులను పంపిణీ చేసిన
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినాయక చవితి సందర్భంగా సీడ్ గణేషాను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కు మార్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్, పంజాగుట్ట సమీపంలో ఉన్న నెక్ట్ గలేరియా మాల్ లో సందర్శకులకు ఎంపి చేతలు మీదుగా విత్తణ గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి వెంకటేష్ నేత, గో రూరల్ సంస్థ సీఈవో సునీల్, టీ న్యూస్ సిజిఎం ఉపేందర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా పర్యావరణహితంగా గణేష్ ప్రతిమలను తయారు చేయటం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ స్ఫూర్తివంతమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. స్వచ్ఛమైన మట్టి, కొబ్బరి నాచు (కోకో పౌడర్) ను వాడుతూ ప్రతిమలను తయారు చేశారు.

ఈ సారి గణేష్ ప్రతిమలతో పాటు వివిధ రకాల విత్తనాలను మట్టిలో పొందుపర్చారు. హరిత తెలంగాణ సాధనలో చింత, వేప చెట్లను విరివిగా పెంచాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆశయం మేరకు ఆ విత్తనాలతో కూడిన మట్టి గణేషులను తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు ఎంపి సంతోష్‌కుమార్ వెల్లడించారు. అలాగే పెద్ద సం ఖ్యలో ఔషధ మొక్కల అవసరాన్ని గుర్తించి, వాటి విత్తనాలతో కూ డా సీడ్ గణేషాల తయారీ, పంపిణీ కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న కాలుష్యం తద్వారా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని తగ్గించాలన్న తలంపుతో విత్తన గణపతుల పంపిణీకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వచ్చినట్లు ఎంపి తెలిపారు. ప్రతీయేటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని, ప్రజలు, భక్తులు వీలైనంత వరకు మట్టి ప్రతిమలను కొలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. తద్వారా వాటి తయారీదారులకు ఉపాధి, పర్యావరణహితం అనే రెండు లక్షాలు నెరవేరుతాయని ఎంపి అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు, పర్యావరణ రక్షణఖు వీలైనన్ని చర్యలు తీసుకోవటంలో ప్రతీ ఒక్కరూ తగిన అవగాహనతో వ్యవహరించాలని కోరారు. నెక్ట్ గలేరియాలో ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు వచ్చిన మాల్ మేనేజ్‌మెంట్‌ను ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ అభినందించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ః ఎంఎల్‌ఎ ముఠా గోపాల్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్‌లో ఎంఎల్‌ఎ ముఠా గోపాల్ సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ ముఠా గోపాల్ మాట్లాడుతూ ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ తమ పుట్టినరోజు పురస్కరించుకుని పర్యావరణానికి మేలు కలిగించే ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోందని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టినచేపట్టిన ఎంపి సంతోష్‌కుమార్‌కి ఎంఎల్‌ఎ ముఠా గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News