Friday, January 10, 2025

క్రికెట్‌కు జోగిందర్‌ శర్మ వీడ్కోలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత జట్టు 2007 టి20 ప్రపంచకప్ హీరో జోగిందర్‌ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మీడియం పేసర్ జోగిందర్ పాక్‌తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో విజృంభించి భారత జట్టును గెలిపించాడు. 5పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా తొలి టి20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

2004లో జట్టులోకి వచ్చిన జోగిందర్ కెరీర్లో తరఫున నాలుగు వన్డేలు, నాలుగు టీ20లు మాత్రమే ఆడాడు. టి20 ప్రపంచకప మ్యాచ్ అతడి చివరి మ్యాచ్ కావడం విశేషం. 2008 నుంచి 2012వరకు చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం జోగిందర్ శర్మ పోలీస్ డిపార్టుమెంటులో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News