Monday, January 20, 2025

జోగురామన్న మాతృమూర్తి బోజమ్మ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Jogu ramanna mother passed away in adilabad

ఆదిలాబాద్: మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు,  మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లు సంతాపం తెలిపారు. శోకతప్తులైన జోగు రామన్న కుటుంబ సభ్యులకు, సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బోజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని పార్థిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.  సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వగ్రామమైన దీపాయిగూడలో అంత్యక్రియలు జరుగుతాయని జోగు రామన్న కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News